Customer Support

మమ్మల్ని సంప్రదించే ముందు, ఒక సారి ఈ కింద రాసి ఉన్న ప్రశ్నలను చదవండి. మీ ప్రశ్నకు తేలిక గా సమాధానం దొరికే అవకాశం ఉంది.

కోర్స్ కొరకు ప్రతి నెల ఎంత చెల్లించాలి ?

మీరు కేవలం ఒక సారే ఫీజు కట్టాల్సివుంటుంది.

కోర్స్ యొక్క పాఠాలు ఎక్కడ చూడాలి ?

ఈ కోర్స్ మీకు మొబైల్ యాప్ లో లభిస్తుంది. పేమెంట్ జరిగిన తరువాత డౌన్లోడ్ లింక్ ఇవ్వబడుతుంది.

క్లాస్ యొక్క టైమింగ్స్ ఏంటి ?

లెసన్స్ అన్ని ముందు నుంచే యాప్ లో అందుబాటులో ఉంటాయి. మీరు వీటిని మీకు నచ్చిన వేళల్లో మీకు నచ్చిన్నని సార్లు చూడవచ్చు.

లెసన్స్ ను డౌన్లోడ్ చేసుకోవచ్చా ?

మీరు యాప్ లోనే లెసన్స్ ను డౌన్లోడ్ చేసుకోవచ్చు మరియు ఆఫ్ లైన్ లో చూడవచ్చు. కానీ మీరు కేవలం యాప్ ద్వారా మాత్రమే ఇవి చూడగలరు.

ఇంగ్లీష్ అస్సలు రాని వారికి ఈ కోర్స్ అర్ధం అవుతుందా ?

ఈ కోర్స్ ఇంగ్లీష్ రాని వారిని దృష్టిలో పెట్టుకుని తయారు చెయ్యడం జరిగింది. మొదటి 2-3 పాఠాలలో నేను ఇంగ్లీష్ లోని చిన్న చిన్న విషయాలను చాలా తేలికగా బోధించడం జరిగింది, దీని వల్ల మీ బేసిక్స్ దృఢంగా ఉంటాయి ఆ తరువాత మీరు తేలికగా అడ్వాన్స్డ్ లెవెల్ పూర్తి చెయ్యవచ్చును.

ఇంగ్లీష్ చదవడం మరియు రాయడం వచ్చు కానీ నేను ఫ్లూయెంట్ గా మాట్లాడలేను, అనే వారికి ఈ కోర్స్ ఉపయోగపడుతుందా ?

అవును ఉపయోగపడుతుంది. ఈ కోర్స్ ను ఇంగ్లీష్ స్పీకింగ్ కొరకు రూపొందించడం జరిగింది. మొదటి నుండి అడ్వాన్స్డ్ లెవెల్ వరుకు మీ స్పీకింగ్ స్కిల్స్ పై ఫోకస్ చెయ్యడం జరుగుతుంది. కోర్స్ లోని ప్రాక్టీస్ గ్రూప్ యొక్క ముఖ్య ఉద్దేశం ఇదే! మీరు ఇతుర విద్యార్థులతో ఆడియో మెసేజ్ల ద్వారా సంభాషించవచ్చు.

తెలుగు చదవడం రాని వారు ఈ కోర్స్ లో జాయిన్ అవ్వొచ్చా ?

జాయిన్ అవ్వవొచ్చు. ఈ కోర్స్ యొక్క పాఠాలు నేను చాలా తేలికైన భాష లో భోదించాను. ఎలా అయితే నా యూట్యూబ్ మరియు ఫేస్బుక్ వీడియోలు మీకు అర్థమవుతాయో అలాగే ఈ కోర్స్ కూడా మీకు అర్ధం అవుతుంది. మొబైల్ యాప్ లో స్క్రీన్ పైన ఎక్కడైతే తెలుగు లో రాసి ఉంటుండో దాన్ని మీరు సెట్టింగ్స్ లోకి వెళ్లి ఇంగ్లీష్ లో కి మార్చుకోవచ్చు.

ఫేసుబుక్ మరియు యూట్యూబ్ లో ఉన్న అవల్ సర్ వీడియోసే ఈ కోర్స్ లో కూడా ఉంటాయా ?

ఉండవు. ఈ కోర్స్ యొక్క పాఠాలు వేరు. ప్రత్యేకమైన పద్దతి లో స్టెప్ బై స్టెప్ నేర్పించడానికి ఈ కోర్స్ తయారు చెయ్యబడింది. కోర్స్ లో పాఠాలతో పాటు క్విజ్ , నోట్స్ , సర్టిఫికెట్ కేవలం ఈ కోర్స్ లోనే మీరు పొందగలరు.

భారత దేశంలో నివసించని వారు కూడా ఈ కోర్స్ లో జాయిన్ అవ్వొచ్చా ?

మీరు ప్రపంచం లో ఎక్కడి నుండి అయినా ఈ కోర్స్ లో జాయిన్ అవ్వొచ్చు.

ఈ కోర్స్ ఐ ఫోన్ లో అందుబాటులో ఉందా ?

లేదు. ఈ కోర్స్ ఉన్న యాప్ ప్రస్తుతం యాపిల్ స్టోర్ లో అందుబాటులో లేదు. ఒక వేళ మీ దగ్గర ఐ ఫోన్ ఉన్నట్లు అయితే మీరు మీ కుటుంబ సభ్యుల యొక్క యాండ్రాయిడ్ ఫోన్ లో ఈ యాప్ ను ఇన్ స్టాల్ చేసుకోవచ్చు.

ఒక లెసన్ పూర్తి చేసే అంత వరుకు దాని తరవాతవి లాక్ చేసి ఉంటాయా ?

లేదు, మీకు అన్ని లెసన్స్ అందుబాటులో ఉంటాయి. కానీ మీకు నేను ఇచ్చే సలహా ఏంటి అంటే ఒక రోజులో ఒక లెసన్ మాత్రమే చూడండి. ఇలా చెయ్యడము వల్ల మీకు ఆ లెసన్ యొక్క టాస్క్ ను పూర్తి చెయ్యడానికి కూడా సమయం లభిస్తుంది

కోర్స్ జాయిన్ అయ్యిన తరువాత ఒకే ఐడి తో రెండు ఫోన్స్ లో కోర్స్ ను యాక్సస్ చెయ్యవచ్చా ?

లేదు, ఒక ఐడి ద్వారా కేవలం ఒక ఫోన్ లోనే కోర్స్ ను యాక్సస్ చెయ్యగలరు.

ప్రాక్టీస్ గ్రూప్ వాట్సాప్ లో ఉంటుందా?

వాట్సాప్ లో 250కి పై మంది సభ్యులను ఒకే గ్రూప్ లో యాడ్ చేయలేము. అందు చేతనే మేము ఎంట్రీ యాప్ నందే ప్రాక్టీస్ గ్రూప్ రూపొందించాము. వాట్సాప్ లో మిగిలిన యూజర్స్ మీ నెంబర్ ను చూసే అవకాశం ఉంది కానీ ఎంట్రీకి యాప్ లో ఆ అవకాశం ఉండదు. అందుకే ఎంట్రీ యాప్ ప్రాక్టీస్ గ్రూప్ సురక్షితం. ఎంట్రీ యాప్ యొక్క “గ్రూప్” సెక్షన్ లో మీరు ప్రాక్టీస్ గ్రూప్ లో జాయిన్ అవ్వొచ్చు.

కోర్స్ ఫీజు పైన డిస్కౌంట్ లభిస్తుందా ?

మీరు చూసే పేజీ పైన ఉన్న ప్రైస్ ఆఫర్ తో కూడి ఉన్నదే. ఇక వేరే డిస్కౌంట్ ఏది కూడా అందుబాటులో లేదు. నేను ఈ కోర్స్ యొక్క ధరను ఎంతో ఆలోచన చేసిన తర్వాతే నిర్ణయించాను. ఈ కోర్స్ ద్వారా మీరు పొందే లాభం ముందు ఈ ధర చాలా చిన్నది.

కోర్స్ కొరకు పేమెంట్ జరిపిన తరవాత ఏం చెయ్యాలి?

మీ పేమెంట్ అందిన వెంటనే మీ అకౌంట్ యాక్టివేట్ అవుతుంది , అనగా మీరు కోర్స్ ని మొదలు పెట్టవచ్చు. నా యాప్ యొక్క లాగిన్ లింక్ మీకు SMS ద్వారా అంది ఉంటుంది. మీరు యాప్ ని డౌన్లోడ్ చేసిన తరువాత మీరు పేమెంట్ సమయంలో ఇచ్చిన నెంబర్ ద్వారా లాగిన్ అవ్వండి.

కోర్స్ ను వాడటం లో ఏమైనా ఇబ్బందులు వస్తే ఎవరిని సంప్రదించాలి?

మీ పేమెంట్ జరిగిన తరువాత మీకు SMS వస్తుంది. దాని లో ఒక నెంబర్ కూడా ఉంటుంది. మీరు ఆ నెంబర్ కు వాట్సాప్ మెసేజ్ చెయ్యవచ్చు. మీ సందేహాలకు మేము త్వరగా సమాధానాం ఇవ్వటానికి ప్రయత్నిస్తూనే ఉంటాం , ఒక వేళ మీకు 24 గంటలలో సమాధానం అందక పొతే ఈ పేజీ కింద ఉన్న “Send Message” బటన్ ద్వారా మా టీం ను కాంటాక్ట్ చెయ్యండి.

ఈ కోర్స్ ఫ్రీ ఎందుకు కాదు?

టీవీ లో చూపించే క్రికెట్ మ్యాచ్ లాగా ఈ కోర్స్ ని కూడా ఎవరైనా పెద్ద పెద్ద కంపెనీలు స్పాన్సర్ చేసి ఉంటే ఈ కోర్స్ ఫ్రీ గానే మీకు అందుబాటులోకి వచ్చేది. కానీ ఈ రోజుల్లో క్రికెట్ మ్యాచులలో కూడా యాడ్స్ ఎక్కువ అయిపోయాయి, బాధాకరమైన విషయం ఏంటి అంటే మిమ్మల్ని సక్సెఫుల్ చేసే ఈ కోర్స్ కు మాత్రం స్పాన్సర్ చేసే వారు ఉండరు. దీని ద్వారా మీరు అర్ధం చేసుకోవాల్సింది ఏంటి అంటే మీ సక్సెస్ కు బాట మీరే వేసుకోవాల్సి ఉంటుంది, దాని పై మీరే ఇన్వెస్ట్ చెయ్యాల్సి ఉంటుంది, ఇంకొకరి సహాయం కోసం వేచి చూస్తూ ఉంటే విలువైన సమయం వృథా అవుతుంది, అందుచేత మనం వేచి ఉండకూడదు. మిమ్మల్ని విజయవంతం చెయ్యడమే నా లక్ష్యం కానీ మొబైల్ యాప్ యొక్క టెక్నాలిజీ ఖర్చుతో కూడుకున్న విషయం, అంతే కాదు మేకేయూ ప్రాక్టీస్ లో సాయపడే టీం కొరకు కూడా ఖర్చు అవుతుంది. అందుకే నేను ఈ కోర్స్ ని తయారు చేసి దీనికి ధర నిర్ణయించాల్సి వచ్చింది.

ఒక వేళ మీ ప్రశ్నలకి సమాధానం దొరికినట్లు అయితే మరియు మీరు కోర్స్ లో జాయిన్ అవ్వడానికి సిద్ధపడితే, "Join Now" బటన్ పై క్లిక్ చెయ్యండి.

Join Now

మీ సందేహాల కొరకు
నా టీంని సంప్రదించండి

Send Message